5 గంటలకే 89 శాతం పోలింగ్‌తో రికార్డు బద్దలు..

Advertisements

<p>ఎండలు మండుతున్నా&period;&period; రాజకీయాలు వేడెక్కుతున్నా&period;&period; బెంగాల్ ఓటరు మాత్రం ఎక్కడా తగ్గలేదు&period; పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల రణక్షేత్రంలో ఓటర్లు పోటెత్తారు&period; ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం&comma; సాయంత్రం వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించారు&period; ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాల ప్రకారం&comma; సాయంత్రం 5 గంటల సమయానికే రాష్ట్రవ్యాప్తంగా సగటున 89&percnt; ఓటింగ్ నమోదైంది&period; ఇక పోలింగ్ ముగిసే సమయానికి 92 శాతం దాటొచ్చనే టాక్ వినిపిస్తోంది&period; పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు&period; కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకే 90 శాతానికి పైగా ఓటింగ్ జరిగినట్లు సమాచారం&period; అయితే ఈసారి కూడా మహిళా ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా కనిపిస్తున్నారు&period; పొడవైన క్యూ లైన్లలో మహిళలు పెద్ద ఎత్తున వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; అక్కడక్కడా కొన్ని హింసాత్మక ఘటనలు మినహా&comma; పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగా సాగింది&period; కేంద్ర బలగాల పహారాలో ఓటర్లు నిర్భయంగా ఓటు వేశారు&period;<&sol;p>&NewLine;<p>సాధారణంగా బెంగాల్‌లో పోలింగ్ శాతం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది&comma; కానీ 5 గంటలకే 89 శాతం మార్కును తాకడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది&period; ఈ భారీ ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది&period; బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది&period; సుమారు 3&period;6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్‌లో జరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఇక తమిళనాడులోనూ పోలింగ్ రికార్డ్ స్థాయిలో నమోదైంది&period; తమిళనాడు అంటేనే సినిమాకు ఓ రేంజ్ క్రేజ్&period;&period; రాజకీయం అంటే ఒక ఎమోషన్&period;&period; ఆ ఎమోషన్‌ను తమిళ తంబీలు ఇవాళ తమ ఓటుతో వ్యక్తపరిచారు&period; సాయంత్రం 5 గంటలకే 82 శాతం పైగా పోలింగ్ అంటే&period;&period; ఇది ఓటర్ల తీర్పు కాదు&comma; రాజకీయ పార్టీలకు ఒక భారీ వార్నింగ్ బెల్ అని చెప్తున్నారు&period; వాస్తవానికి ఎండాకాలం కావడంతో&period;&period; మధ్యాహ్నం సమయానికి ఎండ తీవ్రంగా ఉంటుంది&period; ఈ క్రమంలోనే ఓటర్లు ఉదయం సమయమే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు&period; అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ బూతుల దగ్గర ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరటం కనిపించింది&period; పోలింగ్ పూర్తిగా ముగిసే సమయానికి 90 శాతం దాటొచ్చనే అంచనాలున్నాయి&period; 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 76&period;6 శాతం ఓట్లు నమోదయ్యాయి&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది&period; ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి&comma; టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది&period; 234 నియోజకవర్గాల్లో 4&comma;023 మంది అభ్యర్థులు పోటీపడ్డారు&period; సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట ట్రయాంగిల్ వార్ జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.