చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటా ఊరు వద్ద శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ ఒంటరి ఏనుగు (Elephant) రోడ్డు దాటడానికి తంటాలు పడింది, అటుగా వెళుతున్న వాహనదారులు ఏనుగును రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంటే సెల్ఫీలు వీడియోలు తీశారు. చిత్తూరు నుండి పలమనేరు వెళ్లే వాహనాలు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఏనుగు ఇటువైపు అటవీ ప్రాంతం నుండి అటువైపు వెళ్లడానికి ఎంతో ప్రయత్నించి చివరికి వాహనాలు అటూ ఇటూ ఎక్కువగా వెళుతుండడం వలన ఒంటరి ఏనుగు వెనుదిరిగింది. ఏనుగు రోడ్డుపై ఉన్నంతసేపు అటవీ అధికారులు అటువైపు రాలేదని, ఆహారం కోసం ఏనుగులు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి. అలాంటిది కనీసం ఒకరిద్దరు ట్రాకర్స్ అయినా పెట్టి గజరాజును రోడ్డు దాటించి ఉంటే బాగుండేది అని చర్చించుకున్నారు.
ఇది చదవండి: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఉద్రిక్తత..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి