Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshKurnool ఫామ్ హౌస్ లో దొంగల బీభత్సవం..

ఫామ్ హౌస్ లో దొంగల బీభత్సవం..

by Rama
Kanekal Crossing Farm House

అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ ఫాం హౌస్ (Kanekal Crossing Farm House) లో శనివారం రాత్రి దొంగలు (Thieves) బీభత్సం సృష్టించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు కనేకల్ క్రాస్ లోని వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముఖంకు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి కుటుంబ సభ్యులను తుపాకులు, నాటు కొడవళ్ళతో బెదిరించి ఒంటిపై నగలు, బీరువాలో సొమ్ము దోపిడీ చేసిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు ఇంట్లోని కుటుంబ సభ్యులందరి వంటిపై ఉన్న 10 తులముల బంగారు నగలు, రూ 38,500 నగదు దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులను ఇంటిలో వేసి తలుపులకు గడియ పెట్టి హుడాయించారు. వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను పగలగొట్టి చీకట్లో పడేశారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు.

ఇది చదవండి: రోడ్డు దాటడానికి తంటాలు పడిన ఒంటరి ఏనుగు..


అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. …
పవన్ కళ్యాణ్‌పై జడ శ్రవణ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన ఫిర్యాదు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో రాజకీయ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. జనసేన పార్టీ నాయకులు …
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో యువతికి ఎమ్మెల్యే ప్రశంసలు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంగవైకల్య యువతి సుంకోజు శివాని సామాజిక సేవపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి …

Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసంఇక్కడక్లిక్చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039090
Total views : 194254

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: