మద్యం మత్తులో సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికెట్లను తన కారుతో అతివేగంగా వచ్చి ధ్వంసం చేసిన బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు. సంఘటన ఈనెల 23వ తారీకు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటుచేసుకుంది. వాహనం నడుపుతున్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుతో పాటు ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా భారీకెడ్లను ధ్వంసం చేయగానే సంఘటన సమయంలో వున్న పోలిసులు నిదితుడినీ స్టేషన్ కు తీసుకు వచ్చారు. కాగా ఫుల్ గా మద్యం సేవించిన షకీల్ కుమారుడు నీ టెస్ట్ చేసేందుకు ఆ రోజు డ్యూటీ లో వున్న ఇన్స్పెక్టర్ ఒక హోమ్ గార్డ్ నీ ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పంపగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో నిందితుడి నీ కావాలనే తప్పించారా లేక తప్పించుకు పోయాడా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో విషయం కాస్త డిజిపి దృష్టి కి వెళ్ళడం తో స్టేషన్ కి వచ్చిన ఆయన కేసు దర్యాప్తు చేసేందుకు గాను ఎస్.అర్.నగర్ డివిజన్ ఏసిపి వై.వి.రావు దర్యాప్తు చేస్తున్నారు.
తప్పించారా లేక తప్పించుకు పోయాడా ?
119
previous post