రోజుకో మాట పూటకో అబద్ధం….

TDP leaders press conference

Advertisements

&NewLine;<p>ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోజుకో మాట పూటకో అబద్ధం మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని నియోజకవర్గ తెదేపా నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ధర్మవరం పట్టణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా నాయకులు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ&comma; ఒకప్పుడు రౌడీషీటర్ గా ఉన్న నీకు పరిటాల రవీంద్ర రాజకీయ భిక్ష పెట్టారన్న సంగతి మర్చిపోవద్దని మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయకుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు&period; ఈ సందర్భంగా విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ 1995లో ఒక అనామకుడిని చంపి ఫ్యాక్షన్ నాయకుడిగా ముద్ర వేసుకున్నావని గుర్తు చేశారు&period; అప్పటినుంచి ఒక రౌడీషీటర్ గా నీకు గుర్తింపు ఉందన్నారు&period; గతంలో స్టీఫెన్ రవీంద్ర నిన్ను కొట్టిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదని గోనుగుంట్ల విజయకుమార్ విమర్శించారు&period; మరోవైపు ఒక అనామకుడిగా ఉన్న నీకు అప్పట్లో పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చి భిక్ష పెట్టిన విషయం మర్చిపోవద్దన్నారు&period; ఇప్పుడు నువ్వు ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నావంటే ఎంత నీచానికి దిగజారావో అర్థం అవుతోందన్నారు&period; గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి గానీ&comma; పరిటాల రవి గురించి గానీ మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు&period; ఓడిపోయిన తర్వాత కనీసం నెల రోజులు కూడా పార్టీలో ఉండలేకపోయావని… అదే పరిటాల రవీంద్ర తనను చంపుతారని తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారని విజయ్ కుమార్ అన్నారు&period; అలాంటి వ్యక్తి కాలి గోటికి కూడా నువ్వు పనికిరావన్నారు&period; 2009&comma; 2014&comma; 19 ఎన్నికల్లో నీకు మేము సహకరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు&period; మీ అసమర్ధతతో ఓడిపోతే అది పరిటాల రవి కుటుంబానికి ఎందుకు ఆపాదిస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; నువ్వు కేతిరెడ్డి తో కుమ్మక్కై 60&colon;40 తో పనులు చేసుకుంటున్న విషయం అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; అసలు ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోలేని దుస్థితి నీదన్నారు&period; పూటకో మాట మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను గందరగోళానికి గురి చేస్తున్నావని ఫైర్ అయ్యారు&period; మరోసారి పరిటాల రవి కుటుంబం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని గోనుగుంట్ల విజయ్ కుమార్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.