పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొలి సారిగా జగిత్యాల జిల్లాకు రానున్నారు. జగిత్యాల కేంద్రంగా రేపు ఉదయం 9.30 గంటలకు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది, ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జగిత్యాల జిల్లా మూడు పార్లమెంట్ నియోజకవరాగాలు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి కలుపుకొని ఉండడం సభ ఎక్కడ ఏర్పాటు చేయడం చేసారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల నుండి ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. రేపు ఉదయం జరిగే సభకు పూర్తి ఏర్పాట్లు చేసారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు, సభ భద్రత కోసం 8 జిల్లా నుంచి సుమారు 1600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
గత మూడు రోజులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ అధికారుల సూచిస్తున్నారు. జగిత్యాలకు మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని, మోదీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉదయం 9.30 గంటల వరకు సభకు స్థలాన్ని చేరుకొని, మోడీ ప్రసంగాన్ని వీక్షించవాసులసింది బీజేపీ నాయకులు కోరుతున్నారు.