కొత్త పింఛను మంజూరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మంది హెచ్ఐవీ బాధితులు రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. వీరిలో కొందరు పింఛను రాకుండానే కన్నుమూస్తున్నారు. మరోవైపు పింఛను అందుకునేవారిలో కొందరు అనర్హుల జాబితాలో చేరుతున్నారు. ఈ పరిణామాలు హెచ్ఐవీ బాధిత కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు, వాచ్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించే వారిలోనే హెచ్ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. పనిచేయాలన్నా ఇలాంటి వారికి శరీరం సహకరించదు. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా తోడ్పాటును అందించే పింఛను కూడా రాకపోవడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 60శాతం మహిళలే ఉన్నారు. వన్ పెన్షన్ విధానంలో కొంతమందిని విద్యుత్తు వాడకం, సొంతిల్లు, ఇతర నిబంధనల అమలుతో లబ్ధిదారులు తగ్గిపోతున్నారు. బాధితుల్లో వితంతువులు ఉన్నట్లయితే వీరికి ఆ పింఛన్‌తోపాటు ఇదికూడా వచ్చేది. ఆధార్ సాయంతో రెండుచోట్ల ప్రయోజనం పొందుతున్నారన్న ఉద్దేశంతో కొందరి పేర్లను తొలగిస్తున్నారు. సుమారు 35వేల మందికి పింఛను అందుతోంది.
కొత్త పింఛన్ల కోసం హెచ్ఐవీ బాధితుల ఎదురుచూపులు..
72
previous post