131
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు. తేజ మిర్చి క్వింటాకు 20,100 మార్కెట్లో పలుకుతుండగా.. కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున మాత్రమే రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని, సరైన మద్దతు ధర కూడ ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని రైతన్నలు వాపోతున్నారు, ఏనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. రైతుల ధర్నాతో రాకపోకలు స్తంభించాయి.