110
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో రైతులు ధర్నా నిర్వహించారు. NH 63 జాతీయ రహదారి నిర్మాణం కోసం చేస్తున్న సర్వే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హన్మాజీ పేట్, పెరకపల్లి, తిప్పన్నపేట, చర్లపల్లి, చల్గల్, తాటిపల్లి రైతులు జగిత్యాల పాత బస్ స్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సర్వేలో తమ భూములు కోల్పోతున్నామని వారు వాపోయారు. ప్రాణాలైనా అర్పిస్తాం కాని తమ భూములు వదులుకోమని స్పష్టం చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.