78
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా అగ్నిమాపక శకటం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు.