Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Telangana నళినికి న్యాయం జరగాలి – రేవంత్ రెడ్డి

నళినికి న్యాయం జరగాలి – రేవంత్ రెడ్డి

by Prakash
revanth reddy - nalini news

తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. తన ప్రశాంతతను భంగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. ఆమెకు తిరిగి పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు అవరోధాలు ఉంటే వేరే శాఖలో అదే హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. నళినికి న్యాయం జరగలేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు.. నళినికి ఎందుకు అన్యాయం జరగాలని రేవంత్‌ ప్రశ్నించారు.

Advertisements

You may also like

Our Visitor

025424
Total views : 147249

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.