76
డబ్బులుంటేనే రాజకీయం అనే ఆలోచనను పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు.
Read Also..
Read Also..