తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక నేటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన చేయనున్నారు. శాసనసభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్‌కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ సభ్యులు, 39 మంది బీఆర్‌ఎస్ సభ్యులు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయ్యింది. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానున్నది. ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేత, ప్రొటెంస్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం రేపటి ఉభయసభలను ఉద్దేశించిన… గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగించే విషయాన్ని స్పీకర్ ప్రకటించనున్నారు. ఆ తరువాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్..
87
previous post