రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయనకు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన అయనకు చేవెళ్ల నియోజకవర్గం లోని 5 మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగి రెడ్డి డీసీసీ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
gaddam prasad kumar
తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలను స్వీకరించారు.
గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్ కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్ పై గడ్డం ప్రసాద్ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు. గడ్డం ప్రసాద్ కు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ప్రసాద్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక నేటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో స్పీకర్ ఎన్నికపై ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటన చేయనున్నారు. శాసనసభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్‌కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ సభ్యులు, 39 మంది బీఆర్ఎస్ సభ్యులు, ఏడుగురు ఎంఐఎం సభ్యులు, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయ్యింది. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ ఉదయం 10.30 గంటలకు సభ ప్రారంభం కానున్నది. ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించిన అనంతరం నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేత, ప్రొటెంస్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం రేపటి ఉభయసభలను ఉద్దేశించిన… గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగించే విషయాన్ని స్పీకర్ ప్రకటించనున్నారు. ఆ తరువాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని శాసనసభ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.




Total views : 61799