తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. మానవ-సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి పంపించనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాన మంత్రి ప్రకటిస్తారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వ్యోమగాముల పేర్లు ప్రకటించడానికి ముందు ప్రధాని మోదీ వారిని కలుస్తారని చెప్పారు. కాగా గగన్యాన్ ప్రాజెక్ట్ ప్రయోగం 2025లో జరగనుంది.
ఇది చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు
మానవులను అంతరిక్షంలోకి పంపించి, తిరిగి తీసుకురాగల సత్తా ఇస్రోకు ఉందని చాటి చెప్పడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమన్నారు. భారత ప్రాదేశిక జలాల్లో వ్యోమగాములను సురక్షితంగా ల్యాండింగ్ చేయనున్నారు. వీఎస్ఎస్సీలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి సాంకేతిక సౌకర్యాలకు ఉద్దేశించిన మూడు అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.