తిరుమల శ్రీవారి (TTD) ని గామి చిత్ర బృందం (Gami Film Team) సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకులు విశ్వక్ సేన్., కథానాయకి చాందిని చౌదరి., దర్శకుడు విద్యాధర్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ…. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గామి సినిమాని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్యాన్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ముందుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం చిత్ర కథానాయకి చాందిని చౌదరి మాట్లాడుతూ…. గామి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అని అన్నారు. రానున్న రెండు నెలల్లో మూడు సినిమాలు విడుదల కానున్నట్లు తెలిపారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి ఎంపీ..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి