మాకు అధికారం ఇవ్వండి…. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం

BJP victory rally in Guntur

Advertisements

&NewLine;<p>గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గ&comma; బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి&comma; కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్ప యాత్ర రెండవ రోజు ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమైంది&period; మారుతి నగర్&comma; నాయి బ్రాహ్మణ కాలనీ&comma; భాగ్యనగర్ కాలనీ&comma; ఎల్ఐసి కాలనీ మీదుగా స్తంభాల గరువు రామాలయం వద్ద ముగిసినది&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ&comma; జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్రకుమార్ విచ్చేశారు&period; ఈ సందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుంటే సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఆ నిధులు అన్ని దారి మళ్ళిస్తున్నారు&period; నరేంద్ర మోడీ గారు దేశంలో ఎక్కడికి వెళ్లినా కానీ ప్రజల మధ్య తిరుగుతున్నారని&comma; కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరదాల మాటున తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు&period; ఇక బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ మాట్లాడుతూ…<br>మోదీ ప్రధాని అయిన పదేళ్లలోనే అందరికీ సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నారు&period; మహిళలు&comma; యువతకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే&comma; మరో పక్క అభివృధ్ది పై దృష్టి సారిస్తున్నారు&period; మన రాష్ట్రంలో ఓక్క రైల్వేలకే 89 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది&period; అలాగే లక్షా 10 వేల కోట్లతో జాతీయ రహదారులు మన రాష్ట్రంలో అభివృధ్ది చేశాము&period; మన గుంటూరులో 500 కోట్లు ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కేటాయించాము&period; మన రాష్ర్టంలో ఎన్ని పధకాలు అమలు చేస్తున్నా&comma; ఏమీ చేయలేదనే వారికి విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర ఒక చెంపపెట్టు లాంటిది&period; కేంద్ర ప్రభుత్వ పధకాలకు తమ తాతలు&comma; తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి ప్రజలను వంచిస్తోంది&period; ప్రజలకు అందుతున్న పధకాలలో వందశాతం కేంద్రం నుండి వస్తున్నవే&period; ఇవన్నీ తెలుసుకున్న ప్రజలు బిజెపి కి మద్దతు ఇస్తున్నారు&period; ఒక్కసారి బిజెపి కి అధికారం ఇవ్వండి&period; అభివృధ్ది అంటే ఏంటో చూపిస్తాం అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్