కబ్జాదారులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు…

Nagaiah is a Dalit community leader

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇడుపూరు గ్రామానికి చెందిన దళిత మహిళ కొండ్రు నాగమ్మకు న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘ నాయకులు నిరసన తెలియజేశారు&period; ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు నాగయ్య మాట్లాడుతూ మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలో దళిత మహిళ కొండ్రు నాగమ్మ భర్త చనిపోవడంతో జీవనాధారమైన పూర్వీకుల కాలం నాటి మూడెకరాల 88 సెంట్ల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుందని అన్నారు&period; రెండు సంవత్సరాల క్రితం తన ఆరోగ్యం బాగాలేక ఆ పొలాన్ని ఖాళీగా ఉంచారని ఇదే క్రమంలో ఇడుపూరు గ్రామానికి చెందిన వల్ల రాజు యాదవ్ తన భూమిని ఆక్రమించుకోక అడిగిన మహిళపై దాడి కూడా చేయడం జరిగిందన్నారు&period; ఈ సంవత్సరం పొలంలో పంట వేసుకుంటే ఆక్రమించిన వ్యక్తి దున్నివేయడంతో దళిత మహిళకు 60 వేల రూపాయలు నష్టం కూడా వాటిల్లిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు&period; దళిత ఎస్సి అసైన్మెంట్ భూముల కబ్జాదారులకు మద్దతుగా నిలిచిన మార్కాపురం ఎమ్మార్వో మంజునాథరెడ్డి&comma; వీఆర్వో బడే సాహెబ్&comma; వీఆర్ఏ నాసర్ లపై చట్ట ప్రకారం విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు&period; అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు&period; ఈ కార్యక్రమంలో బాధితురాలు కొండ్రు నాగమ్మ&comma; దళిత సంఘ నాయకులు&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..