పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది పాలన..

Chinthala Ashok

Advertisements

&NewLine;<p>టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు&period; టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు&period; రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని&comma; అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు&period; వచ్చే ఎన్నికల్లో టిడిపి &&num;8211&semi; జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు&period; పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అన్నారు&period; రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు&period; ఎక్కడ చూసినా అరాచకాలు&comma; వైసీపీ నాయకుల దాడులు చూస్తూనే ఉన్నామన్నారు&period; రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు&period; రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు&period; అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంను ప్రపంచ పటంలో చూపించగలరన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్