మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదు..

Supreme Court

Advertisements

&NewLine;<p>రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది&period; మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది&period; తమిళనాడు మంత్రి వి&period;సెంథిల్ తొలగింపు కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది&period; రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత జూన్ 13à°¨ అరెస్టు చేశారు&period; దీంతో&comma; మంత్రిని కేబినెట్‌ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్&period;ఎన్&period;రవి ఆదేశాలు జారీ చేశారు&period; ఈ ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కనపెట్టింది&period; మంత్రి అరెస్టయ్యాక కూడా మంత్రివర్గంలో కొనసాగడాన్ని సవాలు చేస్తూ ఎం&period;ఎల్&comma; రవి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు&period; దీంతో&comma; సదరు న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు&period; ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్&period;ఓకా&comma; జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం&period;&period; రవి వాదనలను తోసిపుచ్చింది&period; హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది&period; ప్రాథమికంగా చూస్తే హైకోర్టు తీరు సరైందే&period; ఓ రాష్ట్ర మంత్రిని గవర్నర్ తనంతట తానుగా బర్తరఫ్ చేయలేరు&period; రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..