62
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న రామభద్రపురం మండలంలో మిచౌంగ్ తుఫాను విఫత్తు వలన పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బేబి నాయన కలిశారు. అనంతరం వారిని పరామర్శిస్తూ పంట పొలాల్లోకి వెళ్లి పూర్తిగా తడిసి పాడై పోయినటువంటి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అలాగే నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి వారికి వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టి ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున బేబినాయన డిమాండ్ చేశారు..