Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్…

ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్…

by Prakash
Heavy traffic jam on Srisailam Ghat road

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి. సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం చివరి రోజులు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భారీగా తరలి వస్తున్నారు. భక్తులరద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి స్పర్శ దర్శనం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు అందరికి అలంకార దర్శనం‌ మాత్రమే కల్పిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: