ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భముగా దుర్గ గుడి ఘాట్ రోడ్ లోని ఓం- టర్నింగ్ వద్ద దేవస్థానము వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు విచ్చేశారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి, శ్రీ రాముల వారి, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు ఆలయ అర్చకులు, వేదపండితులు, వేద విద్యార్థుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యముల నడుమ పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు SPF సిబ్బంది, హోం గార్డ్స్ మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనము అందుకుని, జెండా వందనము జేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొని జాతీయ గీతములు ఆలపించారు. తదనంతరము గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, అమ్మవారి స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి చైర్మన్, కార్యనిర్వాహనాధికారి ప్రసంగించి అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవములు జరుపుకోవడం అందరి పూర్వ జన్మ ఫలం అని అన్నారు. అనంతరం చిన్నారులకు, దేవస్థానము సిబ్బందికి, spf వారికి, భక్తులకు చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి లడ్డు ప్రసాదం, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేదపండితులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పొలిసు సిబ్బంది, ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
89
previous post