గుడిమల్లం శివాలయం

Gudimallam Shiva Temple

Advertisements

&NewLine;<p>పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు&period; అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు&period; కానీ తల్లిని చంపినందుకు తీవ్ర అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చితం చేయడంకోసం ఋషులు దగ్గరకు వెళతాడు&period; అతగాడు ఋషులు ఇచ్చిన సలహాను అనుసరించి శివుణ్ని ఆరాధించడానికి బయలుదేరుతాడు&period; అలా ప్రయాణిస్తున్న తన మార్గంలోనే ఒక అడవి మధ్యలో ఈ శివలింగాన్ని దర్శించాడు&period; అలా దర్శించుకున్న అతను ఈ ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్మించుకుని దాని ఒడ్డునే తపస్సు చేయడం ప్రారంభించాడు&period; ఆ సరోవరంలో రోజుకు ఒక్క పుష్పం మాత్రమే పూసేది&period; దానిని తీసుకుని శంకరునికి పూజాసమయంలో పరశురాముడు సమర్పించేవాడు&period; ఆ పుష్పాన్ని అడవి జంతువులనుంచి కాపాడుకోవడానికి చిత్రసేనుడనే ఒక యక్షుడిని కాపలాగా నియమించాడు&period; దానికి బదులుగా ప్రతిరోజు ఒక జంతువును&comma; కొంత పానీయాన్ని ఇవ్వడానికి పరశురాముడు ఆ యక్షునితో ఒప్పందం కుదుర్చుకున్నాడు&period;<br><strong>ఆలయ వివరాలు &colon;<&sol;strong><br>చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో ఒక చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం చెందిన ఒక ఏర్పేడు గ్రామం వుంది&period; ఈ గ్రామంలో పూర్వం ఆంధ్రశాతవాహనుల కాలంనాటి పురాతన శివాలయం వుంది&period; పురాతన శాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీ&period;శ&period; 2వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు&period; క్రీ&period;శ&period; 1973లో జరిపిన తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయాన్ని జాతీయసంపదగా గుర్తించారు&period; ఈ దేవాలయాన్ని కొంతకాలం వరకు చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు&period; ఆ తరువాతి కాలంలో ముస్లిం పాలకులు ఆ చంద్రగిరిరాజుల సంస్థానంతోపాటు ఈ దేవాలయాన్ని కూడా చాలావరకు ధ్వంసం చేశారు&period; అయితే మూలవిరాట్ స్వామికి మాత్రం ఎటువంటి హాని కలుగలేదు&period; ఈ ఆలయ గర్భాలయంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగరూపంలో కాకుండా మానవరూపంలో మహావీరుడైన వేటగాని రూపంలో శివుడు కొలువై వున్నాడు&period; లింగం సుమారుగా ఐదు అడుగుల పొడవు&comma; ఒక అడుగు వెడల్పు వుంటుంది&period; ఈ ఆలయం పశ్చామాభిముఖంగా వుంటుంది&period; తవ్వకాల్లో లభించిన కొన్ని ఆధారాల ప్రకారం 12వ శతాబ్దలో విక్రమచోళుడి కాలంలో ఈ ఆలయం పునర్మించబడిందని తెలుస్తోంది&period; చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం వరకు ఈ ఆలయానికి నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు&period; అయితే ఈ ఆలయంలోని లింగాలను ఎవరు&comma; ఎప్పుడు&comma; ఎలా నిర్మించారోనన్న ఆధారాలు&comma; సమాచారం తెలియరాలేదు&period; ఈ ఆలయంలో వున్న లింగాకారం మరే ఆలయంలో లేనివిధంగా పురుషాంగాన్ని పోలి వుంటుంది&period; దానిమీద రాక్షసుడి భుజాలపై నిలబడిన శివమూర్తి వుంటుంది&period; చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పరమ్ బేడు&comma; పల్లవుల కాలంలో గుడిపల్లంగా పిలవబడింది&period; కాలక్రమంలో రానురాను అది గుడిమల్లంగా మారి&period;&period; ఆలయం చుట్టూ ఒక చిన్న గ్రామం ఏర్పడిపోయింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం