చేనేత కార్మికులను ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా వారికి సహకారం అందిస్తూ .. చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక తిరుచానూరు శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన – 2023 కార్యక్రమంను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి కష్టాలను గుర్తించి తోడ్పాటును అందించేలా వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరు కొనుగోలు చేయాలని అన్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన నాణ్యమైన అన్ని రకాల వస్త్రాలు ఆరోగ్యకరమైనవి ఎలాంటి హానికర పదార్థాలు వాడరని తెలిపారు. అన్ని సీజన్లోనూ లో ప్రతి ఒక్కరు ధరించేలా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల వెరైటీలు చాలా తక్కువ రేటుతో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు. చేనేత కార్మికులు సొంత మగ్గాలు ద్వారా తయారుచేసిన నాణ్యమైన మరియు వైవిద్యమైన ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం కొరకు సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఎగ్జిబిషన్ నందు ధర్మవరం, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ, నారాయణవరం, మంగళగిరి, చీరాల, మాధవరం , హ్యాండి క్రాఫ్ట్, బెడ్ షీట్స్ వంటివి అందుబాటులో ఉంచడం జరిగిందని పండుగలు సందర్భంగా తిరుపతి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ.. రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నేటి నుండి జనవరి 2 వరకు 14 రోజులు నిర్వహించనున్నారని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఉత్పత్తి అయినటువంటి చేనేత రకాలు అందుబాటులో కలవని తెలిపారు. ఉత్పత్తి ధరలకే నేరుగా చేనేత కళాకారుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్రదర్శనను తిరుపతి పుర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎ డి పిచ్చెశ్వర రావు, డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.