56
నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలంలో దళిత సర్పంచ్ హరిబాబుకు ఘోర అవమానం జరిగింది. మర్రిపాడు మండలం బూదవాడ సచివాలయంలో సర్పంచ్ చాంబర్లో కూర్చునేందుకు అధికారులు కనీసం కుర్చీ కూడా వేయలేదు. దీంతో సర్పంచ్ హరిబాబు తన ఛాంబర్ లో నేలపై కూర్చొని తన ఆవేదన తెలిపాడు. సచివాలయంలో ప్రతి ఒక్కరికి కుర్చీలు ఏర్పాటు చేశారని తనకు మాత్రం కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదన్నారు. కనీసం తనకు కుర్చీ కూడా లేకపోవడంతో సచివాలయం కి రావాలంటే తనకు అవమానంగా ఉందంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..