తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు. బీజేపీ అజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కు మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని గవర్నర్ నిరాకరించారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఎందుకు ఆమోదించారని ప్రశ్నించారు. ఇది ద్వంద్వ నీతి కాదా అంటూ హరీష్రావు నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమంటూ హరీష్రావు ట్వీట్ చేశారు.
గవర్నర్ తీరుపై మండిపడ్డ హరీష్ రావు
65
previous post