చనిపోయే వరకు ఆ జెండాను భుజాన మోస్తూనే ఉంటా…

Former TDP Minister Senior Leader Bandaru Satyanarayana

Advertisements

&NewLine;<p>టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు&period; నగరి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా వేసిన ప్రైవేటు కేసు విచారణలో భాగంగా నగరి జిల్లా కోర్టుకు టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ హాజరయ్యారు&period; కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను&comma; కార్యకర్తలను వేధించి వారి మీద కేసులు పెట్టి&comma; వారిని భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని గాలి వదిలేసారని ఆరోపించారు&period; ప్రజాస్వామ్య పద్దతిలో&comma; రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైన సైకో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు&period; చంద్రబాబు నాయుడు పై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు&comma; ఎలాంటి ఆధారాలు లేకుండా అయనను జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు&period; కోర్టు మొట్టికాయలు వేసింది&period; వైసీపీలో మంత్రులు&comma; ఎమ్మెల్యేలు వ్యక్తిగత ధూషనలకు వెళ్ళారు&period; కుటుంబంలో మహిళను టార్గెట్ చేశారు&comma; దానికి దీటుగా టిడిపి నాయకులు వ్యవహరిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి జైలులకు పంపిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు&period; అందరినీ బెదిరించి&comma; బయపెట్టి అధికారంలో ఉండాలని జగన్ చూస్తున్నాడు&period; ఇక నాపైనా గుంటూరు&comma; నగరి నుండి చాలా చోట్లు దోంగ కేసులు పెట్టారు&period; నెల రోజుల్లో చంద్రబాబు&comma; పవన్ పాలనా వస్తుందని&comma; జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారిద్దరూ పనిచేస్తారు అన్నారు&period; ఎన్నికల తరువాత జగన్ రాష్ట్రంలో ఉండడని&comma; జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలు అని అన్నారు&period; నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని&comma; రోజా ముందు తన నోరును సరిచేసుకోవాలని హితవు పలికారు&period; ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులే ఉంటారని&comma; తెలుగుదేశం జెండాను చనిపోయే వరకు భుజాన మోస్తూనే ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..