మరణంలోనూ వీడని వృద్ధ దంపతుల బంధం..

మరణంలోనూ వీడని వృద్ధ దంపతుల బంధం

Advertisements

<p>దశాబ్దాల కాలం పాటు ఒకరికొకరు తోడుగా ఉంటూ&comma; ఆఖరి శ్వాస వరకు వెంటే ఉంటామని బాసలు చేసుకున్న ఆ వృద్ధ దంపతులు మరణంలోనూ జంటగానే కానరాని లోకాలకు వెళ్లిపోయారు&period; నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హుంన్సా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది&period; గ్రామానికి చెందిన బాదే సిద్దయ్య గురువారం వేకువజామున నిద్రలోనే కన్నుమూశారు&period; ప్రాణ సమానమైన భర్త మరణాన్ని ఆయన భార్య తట్టుకోలేకపోయారు&period; పుట్టెడు దుఃఖంతో మనస్తాపానికి గురైన ఆమె&comma; ఆరోగ్యం క్షీణించడంతో భర్త చనిపోయిన మరుసటి రోజే శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు&period; కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు&period; వారి అపురూప అనుబంధాన్ని చూసి గ్రామస్థులు బోరున విలపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.