ఏనుగుల గుంపు హల్‌చల్‌ – భయాందోళనలో ప్రజలు

Herd of elephants

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది&period; వల్లివేడు పంచాయతీ పరిధిలో మామిడి తోటలపై విరుచుకు పడుతూ పంట నష్టానికి పాల్పడుతున్నాయి&period; అంతే కాకుండా ఏనుగుల గుంపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి&period; సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మామిడి చెట్లను పరిశీలించారు&period; ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు&period; పంట నష్ట తీవ్రతను అంచనా వేయాలని సూచించారు&period; అనంతరం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద ప్రజలు&comma; బాధిత రైతులతో మాట్లాడారు&period; 10 ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో వచ్చి పంటను నష్టపరచడం ఇది మూడవ సారి అని తెలిపారు&period; కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగుల గుంపు వస్తోందని&comma; ఏ క్షణాన్నైనా గ్రామం వైపు వస్తాయేమోనన్న భయం నెలకొందని వారు తెలిపారు&period; అటవీ సరిహద్దు ప్రాంతాలైపైన అటవీ శాఖ అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరారు&period; వెంటనే చిత్తూరు&comma; తిరుపతి జిల్లాల డీఎఫ్ఓ అధికారులతో మోహిత్ రెడ్డి మాట్లాడారు&period; అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కోరారు&period; అధైర్య పడకండి&period;&period; ఐకమత్యంగా మెలిగి ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఏనుగుల గుంపును తరిమేద్దామని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు&period; నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు&period; సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్ళరాదని సూచించారు&period; ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు&period; జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు&period; ఏనుగుల గుంపును త్వరితగతిన తరలింపునకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు&period; ఫారెస్ట్ అధికారులు&comma; ప్రభుత్వ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..