వివేకం సినిమా పై హైకోర్టు సీరియస్,
సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారు? హైకోర్టు సూటి ప్రశ్న
ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నవివేకం(Vivekam Movie) సినిమా ఎలా ప్రదర్శించబడుతుంది: హై కోర్ట్
నారా లోకేష్ మరియు తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి. వైయస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా తెలుగుదేశం స్వప్రయోజనాల కోసం వాడుతుంది అని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ పిటిషన్ పై విచారించిన హై కోర్టు(High Court). తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉదహరించిడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన దస్తగిరి. కేసు సిబిఐ కోర్టులో విచారణలో ఉండగా సినిమా తెరకెక్కించడంపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన దస్తగిరి. ఐ -టి డి పి ప్రోత్సాహంతోనే ఈ సినిమా అన్ని ఓటీడీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రదర్శించబడుతుందన్న పిటిషనర్. తక్షణమే ఈ సినిమా నీ నిలుపుదల చేయాలని తన పిటీషన్ లో కోరిన దస్తగిరి.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నియమ నిబంధనలు లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే వ్యక్తుల హక్కులకు భంగం కలగదా ??
పులివెందుల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడటం తన హక్కులకు భంగం కలిగిస్తుందన్న పిటిషనర్. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్న ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని ఆరోపించిన దస్తగిరి. తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ నుండి వివరణ తీసుకోవాలని ప్రభుత్వా న్యాయవాదిని ఆదేశించిన ధర్మాసనం. ఒక దశలో దీనిమీద ఉత్తర్వులు ఇస్తామన్న ధర్మాసనం. సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ నుండి వివరణ తీసుకోవటానికి ఒక్కరోజు గడువు కోరిన ప్రభుత్వ న్యాయవాది. విచారణ ఎల్లుండికి వాయిదా.
ఇది చదవండి : సుహాస్ హీరోగా ప్రేమకథా చిత్రం “ఓ భామ అయ్యో రామ”…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి