దామినేడు ఇందిరమ్మ సమస్యలను పరిష్కరించాలంటూ స్థానికులతో కలిసి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కు వినతి పత్రం అందజేశారు. దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు గోడలకు సున్నాలు కాదు మౌలిక వసతులు కల్పించాలని పులి వర్తి సుధా రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల మీ ఇంటి వద్దకే మీ నాని కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి నాని, స్థానిక సమస్యలకు చలించి సొంత నిధులతో సుమారు 5 లక్షల రూపాయలతో వ్యర్ధాలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రధానంగా అండర్ డ్రైనేజీ సమస్యలను, మౌలిక వసతులను పరిష్కరించకుండా, గోడలకు సున్నాలు వేసేందుకు, సుమారు 7.5 కోట్లు నిధులను మంజూరు చేసి, తన వర్గీయులకు టెండర్లు అప్పగించారని చెప్పారు. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసే ప్రజలను మభ్యపెడుతున్నారే తప్ప నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కనపడలేదని చెప్పారు. ముఖ్యంగా దామినేడు ఇందిరమ్మ ఇళ్లు వద్ద డ్రైనేజీ నీరుతో త్రాగు నీరు కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పినట్టు అనుసరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు సమస్యలకు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో స్థానికులతో కలిసి సమస్యలను పరిష్కరించేంతవరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఇళ్ల సున్నాలకు అన్ని కోట్ల రూపాయలు అవసరమా..!
148
previous post