77
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా బంగారం తరలిస్తున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 6 కేజీల బంగారు ఆభరణాలు 49 వేల నగదును స్వాధీన పరుచుకున్నట్లు భీమవరంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రవి ప్రకాష్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా మార్గమధ్యలో భీమవరంలో రైలు దిగి రోడ్డు మార్గాన రాజమండ్రి వెళ్తున్న నేపథ్యంలో నిందితులను టౌన్ పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు. పట్టుపడ్డ బంగారు ఆభరణాలు విలువ మూడు కోట్ల 84 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.