నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలే – హనుమంతరావు

Hanumantha Rao

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడీ&comma; సీబీఐ&comma; ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి&period; హనుమంతరావు అన్నారు&period; కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్&comma; బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు జరపడంలేదని ప్రశ్నించారు&period; ఆ రెండు పార్టీలలో డబ్బులు ఉన్నవారు లేరా అని నిలదీశారు&period; గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ&period;&period; పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ చేయడంతో పాటు వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ చేశారని మండిపడ్డారు&period; నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు&period; అమిత్ షా పనిగట్టుకుని ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు&period; సృజనా చౌదరి&comma; సీఎం రమేష్ లు టీడీపీలో ఉన్నప్పుడు కేసులు వేశారు&period; వారు బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజమెత్తారు&period; ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని అన్నారు&period; విశాఖ స్టీల్ ప్లాంట్&comma; ఏపీకి స్పెషల్ స్టేటస్ లపై కొట్లాడిన పవన్ కల్యాణ్ తిరిగి బీజేపీ వైపు చేరడంపై పునరాలోచన చేయాలన్నారు&period; ఇండియా కూటమిలో నితీష్&comma; కుమార్&comma; శరత్ పవార్&comma; మమతా&comma; స్టాలిన్ లు రాహుల్ కు మద్దతుగా ఉన్నారని ఈసారి కేంద్రంలో మోడీ&comma; రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.