రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కాకి బట్టలతో తమకు తెలిసిన వారిని, ఆలయం ఎగ్జిట్ ద్వారం నుండి లోపటికి తీసుకెళ్తూ, ఓవరాక్షన్ ప్రదర్శించాడు. పేదల దేవుళ్ళుగా చెప్పుకునే రాజన్న ఆలయంలో, సాధారణ భక్తులకు తిప్పలు తప్పడం లేదనడానికి, నిదర్శనం ఈ సంఘటన. శని ఆదివారాలు, సెలవు దినం కావడంతో రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఓ పోలీసు ఉన్నతాధికారి తనకు తెలిసిన వారిని ఎగ్జిట్ ద్వారం గుండా గుడిలోకి తీసుకెళ్లగా, ఇలా ఎందుకు తీసుకెళ్తున్నారని స్థానికులు అడుగగా, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే ఆ పోలీస్ ఉన్నతాధికారి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది సాయంతో లోపటికి తీసుకెళ్లడం గమనార్హం. సాధారణ భక్తులేమో తిప్పలు పడాల, పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా అంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అటు పోలీస్ ఉన్నతాధికారి వ్యవహార శైలి, ఆలయ సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేసి చూడాల్సిందే అని స్థానికులు అంటున్నారు.
పోలీస్ అధికారైతే అడ్డదారిలో పోవాలా…
61
previous post