కేంద్రంలోని బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత అత్యన్నుత పురస్కారం భారతరత్నను మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానికి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ.. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇస్తున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించానని తెలిపారు. ఎల్‌కే అద్వానీ రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు. భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని, చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారని మోదీ పేర్కొన్నారు. అనేక కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారని, పార్లమెంట్‌లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని చెప్పారు. కొన్నేళ్ల క్రితం వరకు అద్వానీ దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వాజ్ పేయ్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ఇస్తున్నట్టు కేంద్రం జనవరి 23న ప్రకటించింది.
బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం..!
55
previous post