మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సిఐటియు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సూరి, రామాంజనేయులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు వర్తింపజేయాలని, కరోనా కష్టకాలంలో పని చేసిన కార్మికులకు పని భద్రత కల్పించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని, ట్రెజరీ ద్వారా 010 ప్రకారంగా వేతనాలు అమలు చేయాలని, రెగ్యులర్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ పద్ధతి ప్రకారం ఓ పి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె చేయడంతో మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే నిలబడిపోయింది.
కార్మికుల నిరవధిక సమ్మె…
68
previous post