బిగ్ స్క్రీన్ పై భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్..

ind vs aus final match

Advertisements

&NewLine;<p>తిరుపతిలో క్రికెట్ క్రీడాభిమానులకు ఆంద్రా క్రికెట్ అసోసియేషన్&comma; ఉమ్మడి చిత్తూరు జిల్లా బాయ్స్&comma; అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ వారు తీపి కబురు అందించారు&period; ప్రపంచ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు అతిపెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు&period; తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర క్రీడా మైదానంలో మధ్యాహ్నం 1 గంటల నుంచి మ్యాచ్ ముగిసేంత వరకు నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు&period; సుమారు 12 అడుగుల ఎత్తు 36 అడుగుల వెడల్పు కలిగిన అతి పెద్ద స్క్రీన్ లు&comma; డీజే సౌండ్స్ అండ్ లైటింగ్ ఏర్పాటు చేశామని&comma; ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ పోటీలను అభిమానులు అందరూ ప్రశాంతంగా వీక్షించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు‌&period; సుమారు 7 వేల నుంచి 10 వేల మంది ఒకే చోటు నుంచి క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు&period; అక్కడకు వచ్చిన క్రికెట్ అభిమానులు అందరికీ ఉచిత ప్రవేశం&comma; రాత్రి భోజనం ఏర్పాటు చేశామన్నారు&period; ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆనందంగా క్రికెట్ మ్యాచ్ వీక్షించాలని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు&period; మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక ఆహ్వానితులు తుడా చైర్మన్ చెవి రెడ్డి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్