57
కృష్ణాజిల్లా గన్నవరంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ ఓపెన్ కాకపోవడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని టేకాఫ్ చేసి గన్నవరం విమానాశ్రయం రన్ వే పైన నాలుగు రౌండ్లు చక్కెర్లు కొట్టారు. అనంతరం వీలు ఓపెన్ అవడంతో సేఫ్ గా విమానం ల్యాండ్ అయింది. అదే విమానంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు. విమాన ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.