61
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఈదురు గాలులకు నేలమట్టమయిన లంక ప్రాంతాలలోని వాణిజ్య పంటలు పసుపు ,కంది, అరటి నీట మునిగాయని, ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ప్రకృతి వైపరీత్యాలు జరగటం చాలా బాధాకరమన్నారు. రైతులకు తీరని లోటుని మంత్రి నాగార్జున ఆవేదన వ్యక్తపరిచారు. గత తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాటలతో సరిపెట్టబోదని,అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం నష్టపరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.