ఆఫ్రికాలో ఎబోలా కలకలం..

ఆఫ్రికాలో ఎబోలా కలకలం

Advertisements

<p>ఆఫ్రికా ఖండంలో ఎబోలా పంజా విసురుతోంది&period; కాంగో&comma; ఉగాండా దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోంది&period; కాంగోలో 88మంది మృతి చెందగా&&num;8230&semi;మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు&period; ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO&period;&period;గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది&period; దీనివల్ల ప్రపంచ దేశాలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేకపోయినా&period;&period; కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది&period; ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది&period; ప్రస్తుత పరిస్థితి కొవిడ్-19 లాంటి మహమ్మారి కాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది&period; అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం లేదని సూచించింది&period; 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17à°µ సారి వ్యాప్తి చెందడమని వెల్లడించింది&period; ప్రాథమిక నమూనాలలో అధిక పాజిటివిటీ రేటు&period;&period; వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుత ఉద్ధృతికి &OpenCurlyQuote;బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వైరస్ వేరియంట్‌ కారణమని అధికారులు గుర్తించారు&period; ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి చికిత్సలు&comma; వ్యాక్సిన్లు లేవు&period; ఈ వేరియంట్‌ తొలిసారి 2007-2008లో ఉగాండాలో కనిపించింది&period; అప్పట్లో ఈ వైరస్ బారిన పడి 37 మంది ప్రాణాలు కోల్పోయారు&period; రెండోసారి 2012లో కాంగోలోని ఇసిరోలో 29 మంది మరణించారు&period; ఈ వైరస్‌కు ప్రత్యేకంగా అమోదించిన చికిత్సలు&comma; వ్యాక్సిన్‌లు లేకపోవడం వల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది&period; సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది&period; అదే సమయంలో వైరస్‌ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని&period;&period; ప్రయాణ&comma; వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది&period; వైరస్‌ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది&period; వ్యాధి నిర్ధరణ అయిన వారిని వెంటనే క్వారంటైన్‌ చేసి&period;&period; వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.