ఢిల్లీలో నేడు మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

Advertisements

<p>దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది&period; నోయిడాలో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించనున్నారు&period; ఢిల్లీ రద్దీకి పరిష్కారంగా ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ పెద్ద ఊరటగా నిలవనుంది&period; ప్రస్తుతం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది&period;ప్రయాణికుల సంఖ్య పెరగడంతో&comma; ముఖ్యంగా పీక్ టైమ్‌లలో ఈ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది&period;దీంతో మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అవసరం చాలాకాలంగా వ్యక్తమవుతూ వచ్చింది&period; ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ&period;11&comma;200 కోట్ల వ్యయంతో నోయిడాలోని జేవర్ ప్రాంతంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది&period; పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైంది&period; నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ను ఈరోజు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు&period;అనంతరం ఆయన టెర్మినల్‌ను కూడా పరిశీలించనున్నారు&period; ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కాగానే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఉన్న ప్రయాణికుల భారం గణనీయంగా తగ్గనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..