అమెరికా ప్రతిపాదనను తోసిపుచ్చిన ఇరాన్‌ దూకుడు..

Advertisements

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి&period;&period; ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడు ఉధృతం చేస్తోంది&period; ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలు సహా అమెరికా స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది&&num;8230&semi;ఇజ్రాయిల్ అణు కేంద్రం టార్గట్ గా డ్రోన్ దాడులను ముమ్మరం చేస్తోంది&period; ఇజ్రాయిల్ ప్రజలు భయాందోళనతో బంకర్లలోపలికి పరుగులు తీయడం యుద్ధ తీవ్రతకు అద్దంపడుతోంది&period;&period;అంతేకాదు ప్రపంచంలో అత్యంత శక్తమంతమైన అమెరికా ఎఫ్ 35 జెట్లను కూడా ఇరాన్ డ్రోన్స్ టార్గెట్ చేయడంతో అమెరికా పునరాలోచనలో పడింది&period;&comma; కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనను ఇరాన్‌ తోసిపుచ్చింది&period; తమ డిమాండ్లు నెరవేరినప్పుడు&comma; తాము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేసింది&period; అప్పటివరకు పశ్చిమాసియాలో భారీ స్థాయిలో దాడులు కొనసాగిస్తామని ఖరాఖండిగా తేల్చి చెప్పింది&period; అమెరికా&comma; ఇరాన్‌ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తోన్న పాకిస్థాన్‌&period;&period; కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్‌కు తెలిపిన అనంతరం&&num;8230&semi; ఈమేరకు ప్రకటన వెలువడింది&period; ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఇరాన్‌పై 15వేల బాంబులు జారవిడిచినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది&period; గతేడాది జూన్‌లో చేసిన దాడులతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమని పేర్కొంది&period; ఈ మేరకు ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి కట్జ్‌&comma; ఐడీఎఫ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఇయాల్‌ జమీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు&period; యుద్ధం మొదలైన తొలి రోజుల్లో అమెరికా&comma; ఇజ్రాయెల్‌లు నిత్యం వెయ్యి బాంబులను జారవిడిచినట్లు చెప్పారు&period; ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో లెబనాన్‌లో ఇప్పటివరకు 1094 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది&period; గడిచిన 24 గంటల్లోనే 22 మంది చనిపోయినట్లు పేర్కొంది&period; మృతుల్లో 121 మంది చిన్నారులు&comma; 81 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది&period;<br &sol;>&NewLine;తాజాగా ఇరాన్‌కు మరో దెబ్బ తగిలింది&period; బందర్ అబ్బాస్ తీరప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ &lpar;ఐఆర్‌జీసీ&rpar; నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి మరణించారు&period; ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా నివేదించింది&period; ఇరాన్‌తో యుద్ధానికి ఐదు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే&period; చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని మూడు రోజుల క్రితం ప్రకటించారు&period; అయితే ఇరాన్&comma; ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం కొనసాగుతోంది&period;ఈ క్రమంలో హర్మూజ్ జలసంధికి సమీపంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ రెజా మృతి చెందారని తెలుస్తోంది&period; అలీ రెజా తంగ్సిరి 2018 నుంచి నావికాదళ కమాండర్‌గా ఉంటున్నారు&period; ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంలో ఈయనది కీలకపాత్రగా భావిస్తున్నారు&period;<br &sol;>&NewLine;ఇరాన్‌తో యుద్ధం ముగింపు కోసం ప్రయత్నాలు జరుగుతోన్న వేళ&period;&period; అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు&period; చర్చల విషయంలో ఇరాన్ వింతగా ప్రవర్తిస్తోందన్నారు&period; ఆ దేశం ఒప్పందం కోసం ప్రాధేయపడుతూనే&period;&period; బయటకు మాత్రం అంగీకరించడం లేదన్నారు &period; అమెరికా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని&comma; ఘర్షణల ముగించేందుకు చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఆ దేశ విదేశాంగమంత్రి స్పష్టం చేశారు&period;ఇరాన్ యుద్ధం విషయంలో నాటో దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంపై ట్రంప్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు&period; ఇప్పటికే మిలిటరీ పరంగా తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ విషయంలో అమెరికాకు నాటో దేశాలు ఏమాత్రం సహకరించడం లేదు&period; నాటో నుంచి ఎలాంటి అవసరం లేదు&period; కానీ&comma; ఇలాంటి ముఖ్యమైన సమయంలో వారు ప్రవర్తించిన తీరును ఎప్పటికీ మర్చిపోబోమని మరో పోస్టు చేశారు ప్రెసిడెంట్ ట్రంప్&period;<br &sol;>&NewLine;అమెరికా యుద్ధవిమానాలు&comma; యుద్ధనౌకలు&comma; సైనిక స్థావరాల గురించి ఇరాన్‌ కు రష్యా &OpenCurlyQuote;రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌’ సహకారం అందిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి&period;&period; ఆ సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని వాటి సారాంశం&period; ఇక తాజా కథనాలపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి స్పందించారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ప్రస్తుతం చాలా నకిలీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి&period; ఇరాన్ నాయకత్వంతో శాంతికోసం మా సంప్రదింపులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు&period; ఇరాన్‌లోని బుషెహర్‌ న్యూక్లియర్‌ పవర్ ప్లాంట్‌ నుంచి తన ఉద్యోగులను రష్యా వెనక్కి రప్పించింది&period; ఈ ప్లాంట్‌పై క్షిపణి పడిన నేపథ్యంలో 163 మంది సిబ్బందిని అక్కడినుంచి తరలించింది&period; ఈ ప్లాంట్‌ను నిర్మించింది రష్యానే&period; మిగతా యూనిట్ల నిర్మాణం కోసం అక్కడ కొందరు సిబ్బంది పనిచేస్తున్నారు&period; అయితే యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి అక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..