భూ సర్వేలో అవకతవకలు…

The survey is being done as part of the YSR Jagananna Bhu Suraksha scheme

Advertisements

&NewLine;<p>నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు&period; వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు&comma; సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు&period; గ్రామంలో మొత్తం 2&comma;900 ఎకరాలు ఉండగా&comma; ప్రస్తుతం సర్వే అనంతరం 3&comma;300 ఎకరాలు భూమి ఉన్నట్లు చూపుతున్నారని రైతులు వాపోతున్నారు&period; ప్రస్తుతం జరుగుతున్న సర్వే వల్ల గతంలో ఉన్న తమ భూమిలో మూడు అడుగుల నుండి 10 అడుగుల వరకు భూమిని కోల్పోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు&period; ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వే వలన గ్రామంలో కలహాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<br>గ్రామంలో కలిసికట్టుగా ఉన్న రైతులు భవిష్యత్తులో అమ్మకాలు కొనుగోలు జరిగిన సమయంలో&comma; ఇప్పుడు జరిగిన భూ సర్వే వలన కొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు వాపోతున్నారు&period; నేడు జరుగుతున్న సర్వే వలన కొంతమంది రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని కోల్పోతుండగా&comma; మరి కొంతమంది రైతులకు అదనంగా భూమి కలుస్తుందని రైతులు చెబుతున్నారు&period; గతంలో ఉన్న సర్వే లెక్కల ప్రకారమే తమకు భూములను చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు&period; ఇళ్ల స్థలాలు&comma; పొలాల్లో కూడా కొంత భూమిని కోల్పోతున్నట్లు ప్రజలు&comma; రైతులు తెలుపుతున్నారు&period; తక్షణమే సర్వే పనులు నిలిపివేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.