తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో తీవ్ర ఉద్రిత పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించాడనికి వెళ్లిన హోం మంత్రి తానేటి వనిత ను దొమ్మేరు గ్రామస్థులు అడ్డుకుని గంటన్నరపాటు రోడ్డుపైనే ఘెరావ్ చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు బొంతా మహేంద్ర కుటుంబాన్ని పరామర్శించి, పరిహారం ఇచ్చేందుకు వెళ్లిన హోం మంత్రిని రోడ్డుపైన నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుకు కృషి చేస్తే.. మాకు చావును బహుమానంగా ఇస్తారా? మహేంద్రను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పినా పట్టించుకోని మీరు.. ఇప్పుడు అతను చనిపోయాక ఎందుకొచ్చారు? మేం చెప్పగానే పోలీసు స్టేషన్కు ఫోన్ చేస్తే మహేంద్ర ప్రాణాలు పోయేవా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మృతుడు మహేంద్ర కుటుంబసభ్యుల్ని పరామర్శించి, పరిహారం అందించేందుకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుతో కలిసి హోం మంత్రి వనిత దొమ్మేరుకు వెళ్లారు. నాగార్జున, వెంకట్రావులను బాధితుడి ఇంటి వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన దొమ్మేరు ఎస్సీ పేట యువత, మహిళలు.. వనిత వాహనాన్ని మాత్రం అడ్డుకుని ఆమెను రోడ్డుపైనే ఆపేశారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా.. మా గ్రామంలోకి మీరొచ్చింది కాక మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులపైకి కుర్చీలు విసిరేశారు. మరోవైపు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన మంత్రినాగార్జున, వెంకట్రావు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, వైసీపీ నాయకుడి తరఫున రూ.10 లక్షల చెక్కు అందించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
దొమ్మేరులో దారుణం…
96
previous post