జనం కోసం జగనన్న… జగనన్న కోసం జనం అనే నినాదంతో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. బండ్లపెంట దర్గాలో శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానం, మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాష, కార్యకర్తలతో కలసి ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. రాయచోటి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వీధులు, కొత్తపల్లె వీధులలోనూ, మహబూబ్ నగర్, జెండా వీధుల్లో ప్రచారం నిర్వహించి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. సిఎం జగన్ హయాంలో జిల్లా కేంద్రం ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి, ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ, మున్సిపల్ సభా భవనంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బేపారి మహమ్మద్ ఖాన్ తెలిపారు.
జనం కోసం జగన్… జగన్ కోసం జనం
94
previous post