ప్రకృతి వ్యవసాయం జగన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంది…

mla srikanth reddy

Advertisements

&NewLine;<p>ప్రకృతి వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని వైకాపా రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు&comma; ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period;రైౖతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా&period; సమర్థవంతంగా ప్రకతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ పంటల పరిశీలనలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం వచ్చారు&period; లావోస్‌ &comma;పీడీఆర్‌&comma; భారత్‌&comma; కెన్యా&comma; జింబాబ్వే&comma; సెనెగల్‌&comma; బుర్కినా ఫావో&comma; ట్యునీషియా&comma; పెరూ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు&comma; పరిశోధకులు ద్వైవార్షిక విరామం&comma; ప్రతిబింబంలో భాగంగా చిన్నమండెం సమీపంలో ఏపీసీఎన్‌ఎస్‌ ప్రాజెక్టు ద్వారా అమలవుతున్న ప్రకతి వ్యవసాయ కార్యక్రమాలను అర్ధం చేసుకోవడానికి సందర్శించారు&period; అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిరాడ్‌&comma; వరల్డ్‌ ఫిష్‌&comma;అలయన్స్‌&comma; బయోడైవర్శిటీ&comma; ఒఈపి&comma; ఇనేరా సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో వున్నారు&period; సేంద్రీయ పంటలను అంతర్జాతీయ బృందంతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి&comma; జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు పరిశీలించారు&period;ఈ సందర్భంగా అంతర్జాతీయ బృందంతో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ&period; ప్రకృతి వ్యవసాయం&comma; రసాయన వ్యవసాయాల మధ్య తేడాలను ఆయన వివరించారు&period; ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవని &comma; వ్యవసాయం పైనే తొంబై ఐదు శాతం మంది జీవిస్తున్నారన్నారు&period; వర్షాభావ పరిస్థితులవల్ల కరవు పరిస్తితులు నెలకొన్నాయని&comma; భూగర్భ జలాలు అడుగంటి పోయాయని &comma;ఆరు వందలు&comma; ఏడు వందల అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నా నీరు పడడం లేదన్నారు&period; జగన్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 80 నుంచి 90 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు&period; ప్రకృతి వ్యవసాయం లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునన్నారు&period; తక్కువ విస్తీర్ణపు పొలంలో ఎక్కువ పంటలను పండించవచ్చునన్నారు&period;ఈ పద్ధతుల ద్వారా పండించిన పంటలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు&period; రసాయనక పద్ధతులతో సాగుచేసిన పంటల వాడకం వల్ల క్యాన్సర్&comma; కిడ్నీ తదితర ప్రమాదకర జబ్బులు సోకుతున్నాయన్నారు&period;ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండిన ఆహార ఉత్పత్తులును వినియోగిస్తున్నారన్నారు&period;జగన్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు విస్తారంగా రుణాలను అందిస్తోందని&comma; తద్వారా మహిళలు ఆ రుణాలతో వ్యవసాయ పంటలకు పెట్టుబడిగా పెడుతున్నారన్నారు&period;ఏ టి ఎం మోడల్ ను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది&period; జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి మాట్లాడుతూ&period;&period; ప్రకృతి వ్యవసాయపంటల వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోందన్నారు&period; తమ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగవుతున్న పంటలను పరిశీలించడానికి వచ్చిన అంతర్జాతీయ బృందానికి శ్రీకాంత్ రెడ్డి&comma; దేవనాథరెడ్డి లు అభినందనలు&comma; కృతజ్ఞతలు తెలిపారు&period;ఈ కార్యక్రమంలో రైతు సాధికారిక సంస్థ అధికారులు చంద్రశేఖర్&comma; టీం లీడర్ ధర్మేంద్ర&comma;జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణమ రాజు&comma; అడిషనల్ ప్రాజెజ్ట్ మేనేజర్ యశోదమ్మలతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.