జగన్ ఒక కటింగ్ మాస్టర్…

Sankharavam public meeting held at Rajam, Vizianagaram district

Advertisements

&NewLine;<p>ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు&period; ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికి మాలిన సలహాలేనని అన్నారు&period; సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు&period; సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు&period; విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు&period; తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేష్ అన్నారు&period; దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు&period; ఇప్పటికే డీఎస్పీ&comma; సీఐ&comma; ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని&period;&period; రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని… అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు&period; చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు&period; అధికారులు నీతి&comma; నిజాయతీతో పని చేయాలని చెప్పారు&period; తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.