రాష్ట్రంలో అందరికీ పధకాలు అందించిన ఘనత జగన్ దే..

peddireddy ramachandra reddy

Advertisements

&NewLine;<p>బొనమంద సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు&period; అవులపల్లి లో టిడిపి నాయకులు కబ్జా చేసుకున్న అటవీ భూములు పోతాయని అవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారు&comma; చంద్రబాబు నాయుడు అవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకున్నారు&period; రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు&period; ఈ ప్రాంతంలో విష జ్వరాలు వస్తె తక్షణ చర్యలు తీసుకున్నాం అని&comma; కలుషిత నీరు ఉందని తెలిసిన వెంటనే ఇక్కడ అర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశాం అన్నారు&period; ఎన్నికల లోపల బొనమంద&comma; పేటూరు తదితర బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు&period; ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి ఉందని&comma; ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందని అన్నారు&comma; వెయ్యి రూపాయల పైన ఎంత ఖర్చు అయినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని గుర్తుచేసారు&comma; నాడు నేడు పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసామని&comma; ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పేదల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అని కులం&comma; మతం&comma; ప్రాంతం&comma; పార్టీ చూడకుండా పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు&period; గతంలో జన్మభూమి కమిటీ చెప్పిన వారికే పథకాలు&comma; పెన్షన్లు ఇచ్చేవారు అని&comma; పేదల కోసం ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాత్రమే అన్నారు&period; వైసిపి వచ్చాక మనకు ఎంత మేలు జరిగిందో టిడిపి కార్యకర్తలు కూడా ఆలోచించాలి అన్నారు&period; గతంలో 100 పేజీల మానిఫెస్టో&comma; 600 హామీలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేసారు&period;<br>మహిళా రుణాలు మాఫీ అని చెప్పి దగ చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు&period; ఆ రుణాలు విడతలవారీగా చెల్లించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దన్నారు&period; మనంతా కలిసికట్టుగా గా సిఎం వైఎస్ జగన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు&comma; కార్యకర్తలు&comma; గ్రామ ప్రజలు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..