85
వైసీపీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సిద్ధం సభ నిర్వహించిన జగన్ నేడు ఏలూరులో రెండో సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భీమిలి సభలో తన వాడీ వేడీ ప్రసంగంతో వైసీపీ క్యాడర్ లో జోష్ నింపిన వైఎస్ జగన్ ఏలూరు సభను కూడా అంతకు మించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దీంతో ఏలూరులో జగన్ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ క్యాడర్ లో పెరుగుతోంది. అలాగే భీమిలి సభకు మించి ఇక్కడ జన సమీకరణ కూడా చేస్తున్నారు. దీంతో ఈ భారీ సభలో సీఎం జగన్ సుదీర్ఘంగా క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.